- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ వేలంలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్ మిగిలిపోయాడు. శుక్రవారం జరిగిన ఆక్షన్‌లో రాహుల్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం వెనుక ఓ కారణం ఉంది. మహారాజా ట్రోఫీ ఈ నెల 20 నుంచి జూలై 12 వరకు జరగనుంది. అయితే, రాహుల్ జాతీయ జట్టు బాధ్యతల్లో నిమగ్నం కానున్నాడు. అఫ్గాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు ప్రకటించిన జట్టులో అతను భాగం. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ పర్యటనకు అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతను మహారాజా టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇటీవల ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన రాహుల్ సత్తాచాటాడు. 14 మ్యాచ్‌ల్లో 593 రన్స్ చేసి టాప్-10 స్కోరర్ల జాబితాలో నిలిచాడు. ఈ వేలంలో భారత బ్యాటర్ కరుణ్ నాయర్ అత్యధిక ధర పలికాడు. అతడిని కోస్టల్ కింగ్స్ మంగళూరు రూ.18 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అలాగే, పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణలకు మైసూర్ వారియర్స్ చెరో రూ.2.5 లక్షలు చెల్లించనుంది.






