నేడు మేడారంలో కీల‌క ఘ‌ట్టం..అష్టదిగ్బంధనం తంతు నిర్వహణ

by velandi.Saikiran |   (  Updated:2026-01-21 03:42:35  IST  )

మేడారం సమ్మక్క మహా జాతర 2026 కీలక ఘట్టం జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది.

నేడు మేడారంలో కీల‌క ఘ‌ట్టం..అష్టదిగ్బంధనం తంతు నిర్వహణ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మేడారం భ‌క్తుల‌కు బిగ్ అల‌ర్ఠ్‌. నేడు మేడారంలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. నేడు మేడారంలో మండమెలిగే పండుగ నిర్వ‌హించనున్నారు పూజారులు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో వనదేవతల పూజా సామాగ్రి శుద్ధి చేయనున్నారు పూజారులు. అనంతరం మేడారంలో అష్టదిగ్బంధనం తంతు నిర్వహణ ఉంటుంది. ఇవాళ, రేపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు.

మేడారం జాత‌ర ఎప్పుడంటే ?

మేడారం సమ్మక్క మహా జాతర 2026 కీలక ఘట్టం జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ నాలుగు రోజుల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటారు. జనవరి 28వ తేదీన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు. జనవరి 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దపైకి వస్తారు. ఈ రోజే అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక జనవరి 30వ తేదీన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. తులాభారం కూడా ఇస్తారు. జనవరి 31వ తేదీన దేవతల వన ప్రవేశం జరగగానే, జాతర ముగుస్తుంది.

Read More..

ప్రజా ప్రభుత్వాన్ని భక్తులు ఎన్నటికీ మరిచిపోలేరు : కడియం శ్రీహరి

Next Story