KCR ఫ్యామిలీ కొత్త డ్రామా.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-02 10:14:31  IST  )

బీఆర్ఎస్(BRS) పార్టీ, కేసీఆర్(KCR) కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్ర విమర్శలు చేశారు.

KCR ఫ్యామిలీ కొత్త డ్రామా.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ, కేసీఆర్(KCR) కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కేసీఆర్(KCR) ఫ్యామిలీ కొత్త డ్రామాకి తెరతీసిందని అన్నారు. అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైంది. హరీష్‌ రావు(Harish Rao) మాత్రమే అవినీతి చేశారని కవిత అంటున్నారు. అప్పుడే హరీష్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనుమతి లేకుండా ఏమీ జరగదు. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని అన్నారు. అవినీతికి బాధ్యత కూడా కేసీఆర్‌దే అని అన్నారు. కాళేశ్వరం అవినీతి వాటాల్లో కవితకు తేడాలు ఉండొచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై కోపంగా ఉన్న కవిత ఎందుకు ప్లేట్ మార్చారని ప్రశ్నించారు. తన బాణాలను హరీష్‌, సంతోష్‌ వైపు ఎందుకు మళ్లించారని అడిగారు.

మరోవైపు కవితపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్‌కు గురైంది. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని సస్పెండ్‌ చేస్తూ విడుదల చేసిన లేఖ బీఆర్‌ఎస్‌ అధిష్టానం పేర్కొన్నది.

Read More..

అనుకున్నదే అయ్యింది.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

Next Story