రేపు కొల్లాపూర్ కి రానున్న జాగృతి అధ్యక్షురాలు కవిత

by Ratna Kumari |   (  Updated:2025-12-26 08:56:10  IST  )

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టి

రేపు కొల్లాపూర్ కి రానున్న జాగృతి అధ్యక్షురాలు కవిత
X

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన 'జాగృతి జనం బాట లో భాగంగా రేపు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి రానున్నారు. కవిత పర్యటన షెడ్యూల్ ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. శనివారం ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్, 10:30 గంటలకు పాలమూరు-రంగా రెడ్డి (అంజనగిరి)పంపు హౌస్, ఉదయం 11 గంటలకు పెంట్లవెల్లి మండల కేంద్రంలో రుణ మాఫీ కానీ భాదిత రైతులతో ఆమె సమావేశమవుతారు. ఉదయం 11:30 గంటలకు పెద్ద కొత్త పల్లి, కొల్లాపూర్ మండలాల ఎరుకల సంఘం సభ్యులతో, మధ్యాహ్నం 12 గంటలకు ముదిరాజ్ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. 12:30 గంటలకు మామిడి రైతులతో కవిత మాట్లాడు తారు. అనంతరం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Read More..

హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జున కాంగ్రెస్ నేత వినూత్న లేఖ

Next Story