హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జు‌నకు కాంగ్రెస్ నేత వినూత్న లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 09:33:46  IST  )

తెలంగాణ (Telangana)లో పొలిటికల్ సెటైర్లు పీక్స్‌కు చేరాయి. తాజాగా, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జు‌నకు కాంగ్రెస్ నేత వినూత్న లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో పొలిటికల్ సెటైర్లు పీక్స్‌కు చేరాయి. తాజాగా, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్-10 (BIGG Boss Sesion-10)లో హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్‌ (KTR)కు అవకాశం కల్పించాలని హీరో నాగార్జునకు సాయికుమార్ లేఖ రాశారు.

అయితే, ఆ లేఖలో హరీశ్ రావు, కేటీఆర్‌లు రాజకీయాల్లో మంచి నటులుగా పేరు ప్రఖ్యాతి సంపాదించారని పేర్కొన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. నటనకే నాట్యం నేర్పిన వారు.. నవరసాలు పండించడంలో వారికి వారే సాటి అంటూ సెటైర్లు వేశారు. ఆస్కార్‌ను సైతం ఆశ్చర్యపరిచే నటన వారిదంటూ ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేశారు. తెలంగాణ ప్రజలకు మోసం చేసిన పాపం వారి సొంతమని.. ఇలాంటి చక్కని నటీనటులకు బిగ్ బాస్ సీజన్-10లో అవకాశం కల్పిస్తే అందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకుతుందంటూ సాయి కుమార్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ అటు బుల్లితెర ఇండస్ట్రీలోనూ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హల్‌చల్ చేస్తోంది.

Read More..

సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని రేవంత్ : మరోసారి హరీష్ రావు ఫైర్


Next Story