- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని రేవంత్ : మరోసారి హరీష్ రావు ఫైర్
సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "అందరినీ తొక్కుకుంటూ వచ్చాను" అని గర్వంగా చెప్పుకునే రేవంత్‌రెడ్డి, తన చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నాడని, అతని చిల్లర రాజకీయాలు, విధ్వంసకర పాలనకు రైతే బలైపోతున్నాడని మండిపడ్డారు.
రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని వ్యక్తి ముఖ్యమంత్రివా అని ప్రశ్నించిన ఆయన, యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తీసుకొచ్చిన యూరియా యాప్ ఏమైందని నిలదీశారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తూ.. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేనా మీరు చెప్పిన "మార్పు" అని మండిపడ్డారు. ఈమేరకు తన తీయటీ లో రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేసిన హరీష్‌రావు... గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా, కాంగ్రెస్ పాలన ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.






