2029 ఎన్నికలలో మళ్లీ అధికారం మాదే : CM రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-24 12:04:50  IST  )

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో / కోస్గి : కొడంగల్ గడ్డ వేదికగా సవాలు చేస్తున్న.. 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి

2029 ఎన్నికలలో మళ్లీ అధికారం మాదే : CM రేవంత్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో / కోస్గి :కొడంగల్ గడ్డ వేదికగా సవాలు చేస్తున్న.. 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో నిర్వహించిన సర్పంచుల సమావేశ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఘాటుగా ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నా తోలు తీశాడంట.. అందుకే నీవు తోలు తీసిన కోడిలా అయినా.. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాత్రూంలో వడి సడుగులు ఇరగ కొట్టుకున్న.. నన్ను విమర్శిస్తున్నాడు. అమెరికాల బాత్రూంలో కడిగినోడు.. చెల్లెలుకు సారే పెట్టనోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. బిడ్డ దుక్కి దున్నినోడిని మీరు ఏమి చేయలేరు అని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొడంగల్ గడ్డ నుండి సవాలు విసురుతున్న వచ్చే 2029 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టు బై థర్డ్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. నేను రాజకీయంలో ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కనివ్వం .. దమ్ముంటే కాస్కోండి అంటూ ముఖ్యమంత్రి చేసిన సవాల్ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కలిగిస్తోంది.

Read More..

కొత్త పాలకవర్గాలకు గుడ్ న్యూస్.. నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Next Story