- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త పాలకవర్గాలకు గుడ్ న్యూస్.. నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్/మహబూబ్ నగర్ బ్యూరో/ కోస్గి: కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అన్నారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గీ పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీ చెప్పారని.. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుందని అన్నారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టిన నాయకులను అభినందిస్తున్నానని తెలిపారు.
కొడంగల్ సమస్యల పరిష్కారానికి తమ సోదరుడు తిరుపతి రెడ్డిని అందుబాటులో ఉంచానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేస్తామని, గ్రామాల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకుని సర్పంచ్‌లో ప్రజా సేవలో నిమగ్నం కావాలన్నారు. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని.. వేరే పార్టీ నుంచి గెలిచారనే వివక్ష ఎక్కడా చూపించొద్దని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సమస్యలు, విభేధాలు ఉంటే పక్కన పెట్టాని అన్నారు. త్వరలోనే ఎస్‌డీఎఫ్ నుంచి చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా ప్రతి పంచాయతీకి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
Read More..






