- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాభివృద్ధికి సీఎం సహకారం.. అసెంబ్లీలో ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
విద్యాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు.

దిశ, కందనూల్: విద్యాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యకు కల్పిస్తున్న ప్రాధాన్యతలో భాగంగా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. అన్ని కులాలు, వర్గాల విద్యార్థుల కోసం ఒకే చోట యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఈ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు తొందరగా ప్రారంభించి పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలు సంతోషిస్తారన్నారు. తాను చిన్నప్పుడు చదివిన పబ్లిక్ స్కూల్ కంటే ఈ స్కూల్ డిజైన్ చాలా బాగుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలకు గ్రీన్ బోర్డు, బెంచీలు ఫర్నీచర్ మంజూరు చేయాలని కోరారు.
Read More : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మహర్దశ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
- Tags
- revanth reddy






