- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో స్థానిక ఎన్నికలు రద్దు.. గెజిట్ జారీ చేసిన ఈసీ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను(Local Elections) నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) అధికారికంగా ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను(Local Elections) నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం గెజిట్ జారీ చేసింది. గతనెల 29న ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
కాగా, బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.
Read More..
స్థానిక ఎన్నికలు నిలిపివేత.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హాట్ కేకులా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్.. గెలుపే ధ్యేయంగా రంగంలోకి అన్ని పార్టీలు






