- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ కేకులా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్.. గెలుపే ధ్యేయంగా రంగంలోకి అన్ని పార్టీలు
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టనున్నారు. వచ్చే సోమవారం నుంచి నామినేషన్‌లు మొదలుకానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రెండు మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలందరూ జూబ్లీహిల్స్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయా గ్రామాలు, మండలాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సి రావడంతో ఎక్కువగా హైదరాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఇప్పటి వరకు దృష్టి పెట్టారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం, సోమవారం నుంచి నామినేషన్‌లు ప్రారంభం కానుండటంతో ప్రచారం ఊపందుకోనుంది.
వేడెక్కనున్న ప్రచారం
అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి, కోమటిరెడ్డి, దామోదర తదితరులు ప్రచారంలో పాల్గొననున్నారు. వీరితో పాటుగా ఇతర ముఖ్య నేతలు, ఎంపీలు రంగంలోకి దిగనున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కేటీఆర్ సహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. త్వరలో హరీశ్ రావు సహా నేతలు ప్రచార వేగాన్ని పెంచనున్నారని సమాచారం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ప్రచారం చేస్తుండగా త్వరలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల, కొండా, డీకే అరుణ, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇలా అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ప్రచారంలో పాల్గొని ఎన్నికల వేడిని పెంచనున్నారు.
వచ్చే నెల 11న పోలింగ్
మొదట నామినేషన్‌లు వేసే రోజు భారీ ర్యాలీలు నిర్వహించి తమ బలాన్ని, గెలుపు సంకేతాలను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 11న ఎన్నికల జరగనుండగా నవంబర్ 14న ఓట్లను లెక్కించనున్నారు. మూడు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నిక వాడి వేడిగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికగా మారనుందని అంచనా వేస్తున్నారు. దీపావళి టపాసుల్లాంటి మాటల తూటాలు పెలుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఇక్కడ గెలవడం ద్వారా హైదరాబాద్ జిల్లాలో బోణి చేయాలని కాంగ్రెస్, తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి బీజేపీ ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.






