- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Delhi Liquor Policy Case: : ఈడీకి ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లెటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హజరుకాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి తెలిపారు. ఈ మేరకు బుధవారం కవిత ఈడీకి రిక్వెస్ట్ లెటర్ రాశారు. ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరుకానున్నట్టుగా కవిత లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని పేర్కొన్నారు. ఈనెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున కవిత ఈడీని సమయం కావాలని లేఖలో కోరారు.
ధర్నాకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీన విచారణకు హాజరవుతానంటూ కవిత లేఖ రాశారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బుధవారం ఉదయం ఈడీ నోటీసులు జారీచేసింది. మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి విచారించాలనుకుంటున్నట్లు ఆ నోటీసులో ఈడీ పేర్కొన్నది. ఈ నెల 9వ తేదీన(రేపు) విచారణకు రావాలని స్పష్టం చేశారు. కాగా, కవిత రిక్వెస్ట్ లెటర్‌పై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read: కాసేపట్లో ప్రగతి భవన్‌కు MLC కవిత..