న్యూ ఇయర్ మత్తు.. హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు ఆల్‌టైం రికార్డు

by Ramesh Naini |   (  Updated:2026-01-01 09:35:44  IST  )

హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చరిత్రాత్మక రికార్డును సృష్టించాయి.

న్యూ ఇయర్ మత్తు.. హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు ఆల్‌టైం రికార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చరిత్రాత్మక రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో రూ.5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీనిని ఆల్‌టైం రికార్డ్‌గా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు..

సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పండుగ వాతావరణం, ఎన్నికల ప్రభావం కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద కస్టమర్ల రద్దీ కొనసాగింది. దీంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ పెరుగుదలతో ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని పేర్కొన్నారు.

READ MORE .....

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హల్‌చల్.. మందుబాబుపై కేసు

Next Story