డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హల్‌చల్.. మందుబాబుపై కేసు

by Ramesh Naini |   (  Updated:2026-01-01 09:34:34  IST  )

జిల్లాలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హల్‌చల్..  మందుబాబుపై కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జిల్లాలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు. కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద బుధవారం రాత్రి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా, సంబంధిత వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పరీక్ష చేయించుకోబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతడు దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు కలకలం రేపింది. వీడియో

READ MORE .....

న్యూ ఇయర్ మత్తు.. హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు ఆల్‌టైం రికార్డు

Next Story