- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌లో విషం తప్పా.. విజన్ లేదు: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని కేటీఆర్ విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని కడుపులో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొండంత విషం పెట్టుకున్నారని కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని విమర్శించారు. కలుషితమైన మూసీ కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని మండిపడ్డారు. తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపై, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపై కడుపులో సీఎం రేవంత్ కొండంత విషం పెట్టుకున్నారని అన్నారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి.. ముందే లక్షన్నర కోట్లు వ్యయం ఏట్లా చెప్పారని ప్రశ్నించారు. డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. మూసీ లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్‌లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.






