- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రోగ్రామ్స్ ఫుల్.. మైలేజ్ నిల్.. తెలుగు రాష్ట్రాల్లో సీన్ రివర్స్
ఏపీ, తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం భిన్నంగా మారింది...

దివ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం భిన్నంగా మారింది. అక్కడ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుండగా.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు సాగిపోతున్నాయి. ఇక ప్రతి పక్షాల విషయానికికొస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తమదైన స్టైల్లో ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. యాంటి గవర్నమెంట్ కార్యక్రమాలతో ప్రతినిత్యం ప్రజల్లో ఉంటోంది.
ఏపీలోనే విచిత్రం
కానీ ఏపీలోనే జగన్ పార్టీ మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినప్పటికి అస్పష్టమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల విశ్వాసాన్ని ఆకర్షించలేకపోతోంది. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి ఇప్పుడు నీతులు చెప్పకపోవడమే కాకుండా తాము చేసేవే కరెక్ట్ అనే ధోరణిలో ముందుకు వెళుతోంది. పెట్రోల్ ధరలు,విద్యుత్ ఛార్జీల పెంపుపై చేసిన ధర్నాలు పార్టీకి మనుగడ ఇచ్చినవిగా చెప్పుకోవచ్చు. సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి పార్టీ పలుచబడుతున్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పర్వాలేదనిపించినా.. ఇటీవల మాత్రం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకింది. అంతేకాదు ప్రజాభిప్రాయం పేరుతో సంతకాలు కూడా సేకరించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం కాదా అనే ప్రశ్న వినిపిస్తోంది. అది కూడా అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తుంటే రాష్ట్రంలో మాత్రమే విభిన్నంగా ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురుస్తోంది.
అంతంత మాత్రమే...
అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర అన్ని విధాలు సహకరిస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొస్తే.. దాన్ని రాష్ట్రప్రభుత్వానికి ఆపాదించడాన్ని ఏ విధంగా చూడాలి అనే ప్రశలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టినా అప్పట్లో ఎందుకు పూర్తి చేయలేదనే నిలదీతలు ఆ పార్టీకి ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. తాము తీసుకొచ్చాము కాబట్టే ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలు ప్రజల మద్దతు తీసుకురాలేకపోయనే విమర్శలను సైతం ఎదుర్కొంటోంది. 2014-19 సమయంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలు, చేసిన కార్యక్రమాలను 2029-24 కాలంలో ధ్వంసం చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నాయి. అలాగే ప్రతిపక్ష నాయకులను ఏవిధంగా టార్గెట్ చేశారనేది సైతం వైసీపీ వ్యహరిస్తునన తీరు అద్ధం పడుతోంది.
పాత చింతకాయపచ్చడిలా రాజకీయం
ఇక తెలంగాణలోనూ ప్రతిపక్ష రాజకీయం పాతగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో కొత్తదనం చూపించాలని అంటున్నారు. పార్టీ పగ్గాలు కేసీఆర్ తనయుడు కేటీఆర్ తీసుకున్నప్పటికీ పార్టీకి మైలేజ్ రావడం లేదు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులు ఇప్పటికీ వెలెత్తిచూపుతున్నాయి. అంతేకాదు కేసులు సైతం ఆ పార్టీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని కేసుల్లో కేటీఆర్ సహా కీలక నేతలు అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.
తండ్రికి, అన్నకు కవిత పోటు
మరోవైపు చెల్లెలు కవిత చేస్తున్న రాజకీయం బీఆర్ఎస్ ను మరింత విమర్శల పాలు చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేకపోయినప్పటికీ.. ఆయనను పరిశీలించి చూస్తే వీక్ అయినట్లు స్పష్టం కనిపిస్తోంది. ఇది పార్టీ బలంపై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబంలో చీలిక మరింత విమర్శలకు దారి తీసింది. కుటుంబంలోనే అవకాశవాద రాజకీయం తయారైంది. సొంత కుంపటి పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్‌ను కవిత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరో వైపు అధికార పార్టీ ప్రజా కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. కానీ రెండు రాష్ట్రాల్లో ప్రతి పక్ష పార్టీల అధినేతల తీరుపై ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతున్నాయి. బలమైన కేడార్, కార్యకర్తలు ఉన్నప్పటికీ అధికారంలోకి రావాలనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టి ఇకనైనా అధికార పార్టీలకు దీటుగా నిలబడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. చూడాలి మరి.






