- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన కేటీఆర్.. శాసన సభలో మీడియాతో చిట్ చాట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్పందించారు. (Assembly meetings) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ (సోమవారం) లాబీలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్సు వస్తుందని, గుడాచారి వ్యవస్థ నెహ్రూ నుంచి నేటి దాకా ఉందన్నారు. శాంతి భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం చేస్తున్నారని, ఈ రోజు నిఘా వ్యవస్థ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చెప్తారా? ట్యాప్ చేయడం లేదు అని అన్నారు. ట్యాపింగ్ నిజం అయితే అధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న డీజీపీ కూడా అప్పుడు అధికారులుగా ఉన్నారని, ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి తెలుసన్నారు. ఏ విధంగా నిఘా వ్యవస్థ పనిచేస్తుందో సీఎం అధికారులు చెప్పరని అన్నారు. వారికున్న నిబంధనల మేరకు ఏ విధంగా సమాచారం వస్తుందో సీఎం అడగరన్నారు.
సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్టిని తప్పిస్తారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అటెన్షన్ డైవర్షన్ తో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని సిట్‌లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు. కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఈ డైవర్షన్స్ గ్రహిస్తున్నారు.. అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఓటు వేశారు.. కాంగ్రెస్‌కు పరిపాలన రాదాని తెలిపోయిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదని, 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
READ MORE ....
KTR: అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ స్పందన






