KTR: అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ స్పందన

by Ramesh Naini |   (  Updated:2025-12-29 09:11:12  IST  )

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

KTR: అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‍ ఇవాళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‍కు సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి.. ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ సీఎంను వాకబు చేశారు. ఏళ్ల తర్వాత వీరి కలయిక రాజకీయ వర్గాలను ఆకర్షించింది. నెట్టింట వీడియో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ (సోమవారం) అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్‌ని కలిసేంత సంస్కారం సీఎంకు ఉంటే చాలు.. బయట మాటల్లోనూ ఇదే సంస్కారం ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఇలా పలకరించుకుంటే మంచిదే’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అలాగే మీసాలు, గడ్డాలు పెంచడంపైన కేటీఅర్ స్పందించారు. ‘గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేదు, గడ్డాలు పెంచడం ఈజీ.. పాలన చేయడమే కష్టం.. సీఎం రేవంత్ గడ్డం మీసాలు లేవని నన్ను కాదు రాహుల్‌, రాజీవ్‌ను అన్నారు.. నేను ఆంధ్రాలో చదివితే తప్పు కానీ అల్లుడు ఏపీ నుంచి తెచ్చుకున్నారు’ అంటూ విమర్శించారు.

READ MORE ....

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన కేటీఆర్.. శాసన సభలో మీడియాతో చిట్ చాట్

Next Story