హద్దు మీరుతున్న కాంగ్రెస్ సర్కార్.. పాడి కౌశిక్ రెడ్డి ఘటనపై స్పందించిన కేటీఆర్

by Ramesh Naini |   (  Updated:2026-01-30 12:20:42  IST  )

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హద్దు మీరుతున్న కాంగ్రెస్ సర్కార్.. పాడి కౌశిక్ రెడ్డి ఘటనపై స్పందించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులుమీరుతున్నదని మండిపడ్డారు. తన స్వగ్రామం వీణవంకలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి‌ని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్బంధ పాలనకు నిదర్శనం అని ఆరోపించారు. మా ఎమ్మెల్యే మీద పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడే నాయకులను మీ నిర్బంధాలతో, అక్రమ కేసులతో భయపెట్టలేరు.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More... క్షమాపణ చెప్పిన BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి

పోలీస్ కమిషనర్‌కు కౌశిక్ రెడ్డి సారీ చెప్పాలి.. IPS అధికారుల సంఘం సీరియస్

Next Story