పోలీస్ కమిషనర్‌కు కౌశిక్ రెడ్డి సారీ చెప్పాలి.. IPS అధికారుల సంఘం సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-30 12:17:36  IST  )

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.

పోలీస్ కమిషనర్‌కు కౌశిక్ రెడ్డి సారీ చెప్పాలి.. IPS అధికారుల సంఘం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy)పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్‌ ఆలం(Karimnagar Police Commissioner Gaush Alam)కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మత మార్పిడులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. పోలీస్ అధికారిపై ఇష్టానుసారం మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పటికే పోలీస్ కమిషనర్‌‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. తనతో పెట్టుకుంటే సంగతి చెబుతానంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు దిగారు.

Read More... క్షమాపణ చెప్పిన BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి

హద్దు మీరుతున్న కాంగ్రెస్ సర్కార్.. పాడి కౌశిక్ రెడ్డి ఘటనపై స్పందించిన కేటీఆర్

Next Story