- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షమాపణ చెప్పిన BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తాను చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Karimnagar Police Commissioner Gaush Alam)పై తాను చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశ పూర్వకంగా అన్న మాటలు కాదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను’ అని కౌశిక్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ను మతం పేరుతో దూషించిన వ్యవహారంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More... పోలీస్ కమిషనర్‌కు కౌశిక్ రెడ్డి సారీ చెప్పాలి.. IPS అధికారుల సంఘం సీరియస్
హద్దు మీరుతున్న కాంగ్రెస్ సర్కార్.. పాడి కౌశిక్ రెడ్డి ఘటనపై స్పందించిన కేటీఆర్






