Phone Tapping Case : నెక్స్ట్ కేసీఆర్‍కు నోటీసులు?.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

by Prasad Jukanti |   (  Updated:2026-01-20 08:19:19  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Phone Tapping Case : నెక్స్ట్ కేసీఆర్‍కు నోటీసులు?.. కేటీఆర్ రియాక్షన్ ఇదే
X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విచారణ, కమిషన్ల పేరుతో మా పార్టీ నేతలను వేధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‍కు నోటీసులు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్‍కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదన్నారు. ఏం చేస్తారో చేసుకోవాలన్నారు. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లొట్టపీసు కేసు అని దుయ్యబట్టారు. ఈ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేసినా కూడా సిట్ ఎంక్వైరీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

సింగరేణి విషయంలో కిషన్ రెడ్డి మౌనం దేనికి?:

రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయాన్ని నిన్న హరీశ్ రావు మాట్లాడగానే వెంటనే ఆయనకు నోటీసులు ఇచ్చారన్నారు. సింగరేణి స్కామ్ ను ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. సైట్ విజిట్‍కు వచ్చిన కంపెనీలకు సృజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయతీ అన్నారు. ఒక ముఠాగా ఏర్పడి సింగరేణి టెండర్లలో గోల్ మాల్ జరుగిందని ఈ విషయాన్ని హరీశ్ రావు బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా చూస్తోందన్నారు. సింగరేణిలో ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరగాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది:

కొంత మంది అధికారులు రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడుతున్నారని కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదన్నారు. ఎమర్జెన్సీ అయితే మీరంతా ఇక్కడ ఉన్న వారా అంటూ ఓ అధికారి మాట్లాడుతున్నారని అలాంటి వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. తమను ఎంత వేధిస్తారో వేధించండి రేవంత్ రెడ్డిని, ఆయన చెప్పినట్లు ఆడుతున్న అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు.

Read More... Phone Tapping Case: కూపీ లాగుతున్న సిట్.. హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం

హరీష్ రావుకు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు

Next Story