- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: మీరేం జడ్జి కాదు.. సజ్జనార్‍కు కేటీఆర్ కౌంటర్
అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని కేటీఆర్ హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ (KCR) చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్‍ను విచారణను నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మాకు గుర్తొచ్చిందని చెప్పారు. మమ్మల్ని తట్టి లేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిన్న కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదని కానీ చట్టం అంటే కేసీఆర్‍కు గౌరవం ఉందని అందుకే సిట్ విచారణకు హాజరు అయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారని విమర్శించారు. హరీశ్‍రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలన్నారు. నిన్న మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారు. పోలీసులు లా అండ్ ఆర్డర్‍పై దృష్టి పెడితే బావుంటుందన్నారు. సుల్తాన్ బజార్‍లో పట్టపగలే ATM దగ్గర చోరి జరిగిందని విమర్శించారు.
బ్లాక్ మెయిల్‍కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డే:
ఈ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదని మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. నల్లమల సాగర్‍తో నీళ్ల దోపిడి జరుగుతుందని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‍కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళారని మండిపడ్డారు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలని సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడని కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్‍ను అందుకే ట్రాన్సఫర్ చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుందన్నారు. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలన్నారు. బ్లాక్ మెయిల్‍కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డేనన్నారు.
సజ్జనార్ జడ్జి కాదు:
సిటీ సీపీ, ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ చీఫ్ సజ్జనార్ (VC Sajjanar) జడ్జి కాదని ఆయన కేవలం పోలీసు అధికారి మాత్రమేనని కేటీఆర్ మండిపడ్డారు. సజ్జనార్ అయినా ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా అని ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ట్వీట్, లీక్‍లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని హెచ్చరించారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లు ఎలా అవుతుందంటూ ఏ ప్రముఖ దినపత్రిక ఎండీ (దిశ కాదు) రాసిన కథనానికి కౌంటర్ ఇచ్చారు. అవును తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే. కేసిఆర్‌ను ముడితే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్టే. అస్తిత్వాన్ని ముడితే ఆత్మ గౌరవాన్ని కొట్టినట్టేనన్నారు.






