మీరు కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతా.. కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-05 07:59:05  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆక్షన్ లో కొనుగోలు చేసిన భూములు అన్నింటిని వెనక్కి తీసుకుని భూముల కన్వెర్షన్ రద్దు చేస్తామంటున్నారు

మీరు కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతా.. కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆక్షన్ లో కొనుగోలు చేసిన భూములు అన్నింటిని వెనక్కి తీసుకుని భూముల కన్వెర్షన్ రద్దు చేస్తామంటున్నారు.. మీరు చేసినవన్నీ మేము వెనక్కి తీసుకుంటున్నామా? అని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నవాటిని కన్వెర్షన్ చేస్తామని అంటున్నారని ఈ రెండు పాలసీలను పదేళ్లు అమలు చేసింది బీఆర్ఎస్ నే అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే రూ.101కోట్లకు అమ్మారని చెప్పారు. నేరుగా అమ్మారా.. వెనకాల ఉన్నారా అన్నది తెలీదుగానీ అమ్మేశారని చెప్పారు. ఓఆర్ఆర్ అమ్మేశారని కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మేశారని విమర్శించారు.

ఎల్బీనగర్ లో సిరీస్ కంపెనీ భూములను కన్వెర్షన్ చేశారని ఆరోపించారు. ఇండస్ట్రీ నడిచేటప్పుడు ఆ కంపెనీ చుట్టుపక్కల నివసించేవారు బోర్లు వేస్తే నీళ్లు పచ్చగా వస్తున్నాయని అనేకసార్లు రోడ్లపైకి వచ్చారని అన్నారు. కెమికల్ ఇండస్ట్రియల్ జోన్ గా ఉన్న ప్రాంతాన్ని మీరు రెసిడెన్షియల్ జోన్ గా మార్చారని మండిపడ్డారు. ఐడీపీఎ మరియు ఇతర ప్రాంతాల్లోని మీ బినామీలు, మీ మంత్రులకు సంబంధించిన భూములను కూడా అలగే చేశారన్నారు. మీరు చేసినట్టు చేయడం మావల్ల కాదని కాంగ్రెస్ నేషనల్ పార్టీ అని అన్నారు. రూ.5 లక్షల కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మీరు అక్రమంగా కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతామని హెచ్చరించారు.

Read More... Hilt Policy: హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు:

Next Story