- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచన చేయాలని అదనపు కలెక్టర్ సి.హెచ్ మహేందర్ జి అన్నారు.

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచన చేయాలని అదనపు కలెక్టర్ సి.హెచ్ మహేందర్ జి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జల వనరుల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా తక్కువ నీటితో పంటలు సాగు చేసే విషయాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో వరి పంట సాగుతో పాటు ఇతర పంటలు ఎంత వేశారనే విషయంపై నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. పామ్ ఆయిల్ పంట కేవలం ఉద్యాన శాఖ కు చెందిందని భావించకుండా వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ బిక్షపతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, నీటి పారుదల శాఖ అధికారి అప్పల నాయుడు, ఉద్యాన శాఖ అధికారి సంజీవరావు, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, ఎస్ఓ లాల్ నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






