- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో మైనర్ బాలిక పై లైంగిక దాడి.. నలుగురు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పై పలువురు వ్యక్తులు వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, కొత్తగూడెం సింగరేణి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పై పలువురు వ్యక్తులు వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. గరీబ్‌పేటకు చెందిన ఓ మైనర్ బాలికను ప్రధాన నిందితుడు మారి రామకృష్ణ ప్రేమ పేరుతో నమ్మించాడు. ఈ నెల 3న జాలే నవీన్, గణేష్ సహకారంతో ఆటోలో ఓల్డ్ డిపో ప్రాంతంలోని వెంకటేష్ గదికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం తెలిసిన కలకుంట్ల విజేందర్ జూలై 4న, బడేటి మహేష్ జూలై 5న వేర్వేరు రోజుల్లో బాధితురాలి పై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జూలై 11న బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో అదే రోజు కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కొత్తగూడెం ఎస్‌డీపీఓ ఎల్. ఆదినారాయణ ఆధ్వర్యంలో జూలై 15న ప్రధాన నిందితుడు రామకృష్ణతో పాటు కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్, జాలే నవీన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు ఆటోలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లు 137(2), 78, 65(1) బీఎన్ఎస్, పోక్సో యాక్ట్ సెక్షన్ 3 r/w 4, 5 r/w 6, SC ST Act సెక్షన్ 3(2)(V), 3(2)(Va) చట్టం కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, కేసుదర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మైనర్ల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






