- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.

దిశ, కోరుట్ల రూరల్ : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఫామ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదని, ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించే కీలక కార్యక్రమమని, జిల్లాలో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తూ, ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారన్నారు. ఇప్పటివరకు సుమారు 60 శాతం ఫారాలు సేకరించామని, మిగిలిన వారు కూడా తమ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి సంకోచం లేకుండా బీఎల్‌వోలు లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఓటరికి అవసరమైన సహకారం అందించేందుకు ఎన్నికల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఫారాల సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియ మందగించడంతో బీఎల్‌వోలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే బీఎల్‌వోల ద్వారా కొంతమంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారినట్లు, మరికొందరు వేరే నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకున్నట్లు సమాచారం అందుతోందన్నారు. అలాంటి వారు తమ ప్రస్తుత చిరునామా, ఇతర నియోజకవర్గంలోని ఓటు వివరాలను ఫారం లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల సరైన నియోజకవర్గంలో ఓటు హక్కు కొనసాగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఒకవేళ ఫారాలు సమర్పించకుండా ఎలాంటి స్పందన ఇవ్వకపోతే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విచారణ అనంతరం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్వయంగా పరిశీలించారు. ఈయన వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, మెట్‌పల్లి, కోరుట్ల తహసీల్దార్లు నీత, కృష్ణ చైతన్య, బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






