- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లొకేషన్ ఆఫ్‌లో పెట్టినా మీరెక్కడున్నారో తెలిసిపోతుంది..! ఇదిగో ‘హిడెన్’ టెక్నాలజీ..
ఫోన్‌లో లొకేషన్ ఆఫ్ చేసినప్పటికీ మీరు ఎక్కడున్నారనేది ఈజీగా గుర్తించడం సాధ్యమే!

దిశ, ఫీచర్స్ : ఫోన్‌లో GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)లొకేషన్ ఆఫ్ చేస్తే.. మీరెక్కడున్నది ఎవరికీ తెలియదని భావిస్తున్నారా? ఎవరూ మిమ్మల్ని ట్రాక్ చేయలేరని అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. నేటి స్మార్ట్ ఫోన్‌లు మీరు లొకేషన్ ఆఫ్‌లో పెట్టుకున్నప్పటికీ మీరు ఎక్కడున్నారనే కచ్చితమైన స్థానాన్ని తెలియజేయగల ఆధునిక అంతర్గత సాంకేతికతను కలిగి ఉంటున్నాయి. కాబట్టి లొకేషన్ ఆఫ్ చేసుకున్నప్పటికీ, మీరు ఎక్కడ ఉన్నారనేది కచ్చితంగా తెలుసుకోగలగడం ఈ రోజుల్లో పెద్ద పనేమీ కాదంటున్నారు నిపుణులు. ఇంతకీ అదెలా సాధ్యం?
నేటి స్మార్ట్‌ఫోన్‌లు కేవలం జీపీఎస్‌ని మాత్రమే కాకుండా, ఇతర అనేక ఆధునిక టెక్నాలజీలను కలిపి ఉపయోగించడం ద్వారా మీ స్థానాన్ని గుర్తిస్తాయి. జీపీఎస్ ఆఫ్ అయినప్పటికీ ఈ ఇంటర్నల్ టెక్నాలజీ పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మీ వద్ద ఉన్న ఫోన్, సమీపంలోని సెల్ టవర్లు (మొబైల్ టవర్లు), Wi-Fi రూటర్లు, బ్లూటూత్ సిగ్నల్స్, ఫోన్‌లోనే అంతర్గతంగా ఉండే మోషన్ సెన్సార్లు(గతి సెన్సార్లు), ఇంటర్నెట్ IP అడ్రస్ వంటి వాటి ద్వారా మీ స్థానాన్ని గుర్తిస్తుంది. అంటే ఇదంతా “మల్టి-సోర్స్ లొకేషన్” అనే వ్యవస్థ ద్వారా జరుగుతుంది. దీంతో మీరు ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థానంలో ఉన్నారనే విషయాన్ని సుమారుగా లేదా కొన్ని సందర్భాల్లో చాలా ఖచ్చితంగా అంచనా వేయడం సాంకేతిక నిపుణులకు లేదా అధికారిక నిఘా సంస్థలకు సాధ్యం అవుతుంది.
ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది?
* సెల్ టవర్లు: మీ ఫోన్ ఏ టవర్‌కు కనెక్ట్ అయి ఉందో దాని ఆధారంగా మీరు ఎక్కడ ఉన్నారనే స్థానం దాదాపుగా తెలుస్తుంది.
* Wi-Fi నెట్‌వర్క్‌లు: సమీపంలో ఉన్న Wi-Fi హాట్‌స్పాట్ల ద్వారా లొకేషన్ డేటాబేస్ సహాయంతో మీ రున్న స్థానం లేదా లొకేషన్ నిర్ణయం జరుగుతుంది.
*బ్లూటూత్ & సెన్సార్లు: బ్లూటూత్ డివైజ్‌లు & ఫోన్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ వంటి సెన్సార్లు మీ కదలికలను విశ్లేషించి లొకేషన్ అంచనా వేస్తాయి.
*IP అడ్రస్: ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మీ ఏరియా స్థాయి లొకేషన్ తెలుస్తుంది. అలాగే మీరు GPS ఆఫ్ చేసినా కొన్ని రకాల యాప్‌లు (మ్యాప్స్, వెదర్, సోషల్ మీడియా) లొకేషన్ ఆధారిత సేవలను నిరంతరం గుర్తిస్తూనే ఉంటాయి.
ట్రాకింగ్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ఆల్ యాప్స్ లొకేషన్ పర్మిషన్లను జాగ్రత్తగా చెక్ చేయండి. అవసరం లేనప్పుడు లొకేషన్ సర్వీసెస్ పూర్తిగా ఆఫ్ చేయండి. Wi-Fi, బ్లూటూత్ స్కానింగ్ ఆప్షన్లను డిసేబుల్ చేయండి. (ఉదా: Settings > Location > Wi-Fi and Bluetooth scanning) దీనివల్ల చాలా వరకు మీ ప్రైవసీని కాపాడుకోవచ్చు. అయితే ఇంకా పూర్తి గోప్యత కావాలంటే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం లేదా లొకేషన్ సెన్సిటివ్ యాపులను నివారించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.






