- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత సమగ్రాభివృద్ధికి ‘మై భారత్’ పోర్టల్ : ఫైజాన్ అహ్మద్
by Taduka Kalyani |
యువత సమగ్రాభివృద్ధికి ‘మై భారత్’ పోర్టల్ ఉపయోగపడుతుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.

X
దిశ,మేడ్చల్ బ్యూరో : యువత సమగ్రాభివృద్ధికి ‘మై భారత్’ పోర్టల్ ఉపయోగపడుతుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. జిల్లాలోని 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత మై భారత్ పోర్టల్ లోని నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బధువారం జిల్లా కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో మై భారత్ పోర్టల్ ను అదనపు కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత- యువజన కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు.కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి 'మై భారత్' డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ జ్ఞానేశ్వర్ బసుత్కర్, ఆఫీస్ అసిస్టెంట్ డి. శ్రీశైలం పాల్గొన్నారు.
Next Story






