- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఆర్టీసీ బస్సులో మగాడి ఆత్మగౌరవ బోర్డు.. మురిసిపోయిన పురుష పుంగవులు
ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగా ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అనే బోర్డును చూస్తూనే ఉంటాం.

దిశ, వెబ్‌డెస్క్: కాలం మారింది.. అవును! ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా తమ క్రియేటివిటీని నిరూపించుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం అదే కోవలోకి మరో అద్భుత కళాఖండం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని ఉండాల్సిన ఆర్టీసీ బోర్డును కాస్తా.. అక్షరాలు మార్చేసి, రాత్రికి రాత్రే ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’గా మార్చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సూర్యాపేట రూట్ బస్సులోనిదని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో తెగ వైరల్..
అయితే, ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అనే బోర్డు ఫొటో బయటపడటమే ఆలస్యం.. పురుష పుంగవులు ఇన్నాళ్లకు మాకు తగిన గౌరవం దక్కిదని ఆహా.. ఓహో అంటూ జబ్బలుచరుకుంటున్నారు. ఫ్రీ బస్సు ప్రయాణాలు లేకపోయినా, కనీసం ఈ బోర్డు చూసైనా సీట్ ఇస్తారేమోనని మరికొందరు మహానుభావులు తెగ మురిసిపోయారు. మరోవైపు బస్సులో కనిపించిన బోర్డు ఒరిజినల్ బోర్డు కాదని, ‘స్త్రీలను’ అనే పదాన్ని తీసేసి అదే స్థానంలో ఏఐ సాయంతో ‘పురుషులను అనే పదం చేర్చారంటూ మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్న ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అనే బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






