- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRENDZ : భారతదేశంలోనే అతిపెద్ద మానవ నెట్ వర్క్
ఈ డిజిటల్ యుగంలో కనెక్టివిటీ చాలా ఈజీ కానీ నిజంగా రూట్స్ వరకు వెళ్తుందా?. కంపెనీలు, వ్యాపార సంస్థలు, ఎన్‌జీఓలు గ్రామాలను చేరుకుంటున్నారా? లేదు కదా..

దిశ, ఫీచర్స్ : ఈ డిజిటల్ యుగంలో కనెక్టివిటీ చాలా ఈజీ కానీ నిజంగా రూట్స్ వరకు వెళ్తుందా?. కంపెనీలు, వ్యాపార సంస్థలు, ఎన్‌జీఓలు గ్రామాలను చేరుకుంటున్నారా? లేదు కదా.. ఈ ఖాళీనే గుర్తించిన ఇద్దరు యువకులు.. గ్రామీణ ఉద్యోగాలను సృష్టించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 1.2 లక్షల గ్రామాలను కవర్ చేస్తూ.. 40,000 యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు.
గ్రామాల్లో మానవ నెట్ వర్క్
బీహార్‌లోని చిన్న పట్టణంలో ఉత్పత్తిని ప్రారంభించాలనుకున్నా.. ఒడిశా గ్రామీణ ప్రాంతంలో చిరునామాను ధృవీకరించాలనుకున్నా... ఛత్తీస్‌గఢ్‌లోని దూర గ్రామంలో సర్వే చేయాలనుకున్నా.. కంపెనీలకు నమ్మదగిన ఎంపికలు చాలా తక్కువగా ఉండేవి. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నా.. గ్రామీణ వ్యక్తులను చేరుకోవడం సవాలుగా మారింది. బ్రాండ్లు, ప్రభుత్వాలు, ఎన్‌జీఓలు ఆన్‌లైన్‌లో కనెక్ట్ కాగలిగినా.. భౌతికంగా చివరి మైలు (లాస్ట్ మైల్) చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ అంతరాన్ని గమనించిన గోవింద్ అగర్వాల్, అర్తి అగర్వాల్.. అనాక్సీ డిజిటల్ రన్నర్స్‌ను స్థాపించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద లాస్ట్ మైల్ ఫీల్డ్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 40,000కి పైగా స్థానిక యువకులు డిజిటల్ రన్నర్స్‌గా పని చేస్తూ.. దేశవ్యాప్తంగా వ్యాపారాలు, సంస్థలు సమాజాలను చేరుకోవడానికి సహాయం చేస్తున్నారు.
నమ్మకం... జీవనోపాధి..
దూరంగా ఉన్న గ్రామాల్లో చిరునామాలను ధృవీకరించడం నుంచి ఆరోగ్యం, వాతావరణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం వరకు.. అనాక్సీ డిజిటల్ రన్నర్స్ సౌకర్యవంతమైన జీవనోపాధులను సృష్టిస్తూ.. సంస్థలు భారతదేశ చివరి మైలుకు చేరుకోవడానికి సహాయపడుతున్నారు. ‘గ్రామీణ భారతదేశంలో ఉన్న సమాచార అసమానతలు, నమ్మక లోపాన్ని గమనించి అనాక్సీని స్థాపించాం’ అని అంటున్నారు కో-ఫౌండర్ & CEO గోవింద్ అగర్వాల్. ‘డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడుతున్నా.. టైర్-2, టైర్-3, గ్రామీణ మార్కెట్లలో బ్రాండ్లు, ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు భౌతికంగా చేరుకోవడంలో ఇబ్బంది పడేవి. భారతదేశంలో ఏ ప్రదేశానికైనా నమ్మదగిన స్థానిక నెట్‌వర్క్ ద్వారా రియల్-టైమ్ యాక్సెస్ అందించే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని మేము భావించాం... అదే అనాక్సీ’ అని తెలిపారు. ప్రస్తుతం అనాక్సీ 540 జిల్లాలు.. 11,000కి పైగా పిన్ కోడ్‌లు.. సుమారు 1.2 లక్షల గ్రామాలు, పట్టణాలను కవర్ చేస్తోంది. వ్యాపారాలు నమ్మదగిన ఆన్-గ్రౌండ్ సపోర్ట్ పొందుతుండగాజజజ వేలాది యువకులు తమ స్వస్థలాలను వదలకుండానే సౌకర్యవంతమైన ఆదాయం సంపాదిస్తున్నారు.
బయోమెట్రిక్ నుంచి హ్యూమన్ నెట్ వర్క్ వరకు
అయితే అనాక్సీ మొదట డిజిటల్ రన్నర్ మోడల్‌తో ప్రారంభం కాలేదు. మొదట ఇది వెంచర్ బయోమెట్రిక్ టెక్నాలజీ. వీన్ రికగ్నిషన్ టెక్నాలజీని డెవలప్ చేశారు. US పేటెంట్ కూడా పొందారు. కానీ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా స్కేల్ చేయలేకపోయారు. ఆ తర్వాత హార్డ్‌వేర్ నుంచి మారి.. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించి ఆన్-గ్రౌండ్ టాస్కులు పూర్తి చేసే స్థానిక వ్యక్తుల డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. 2016 నాటికి ఇది డిజిటల్ రన్నర్ మోడల్‌గా మారింది.
డిజిటల్ రన్నర్ అంటే ఏమిటి?
గోవింద్ దీన్ని రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పోల్చి చెప్పారు. డిజిటల్ రన్నర్ అంటే ‘లోకలైట్’ లేదా ‘సన్ ఆఫ్ ది సాయిల్’.. గ్రామం లేదా నగరంలో నివసించే టెక్-సావీ వ్యక్తి. ఉబర్ డ్రైవర్లు ఎలా ఉంటారో.. అలాగే రన్నర్స్ తమ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించి ఇంటి దగ్గర టాస్కులు పూర్తి చేస్తారన్న మాట. చిరునామా ధృవీకరణ, మార్కెట్ సర్వేలు, మెర్చంట్ ఆన్‌బోర్డింగ్, డేటా సేకరణ మొదలైనవి వారి పనులు. అనాక్సీ పార్ట్‌నర్ యాప్ ద్వారా టాస్కులు అందుతాయి. క్లౌడ్-బేస్డ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొబైల్ యాప్‌లు, డాష్‌బోర్డులు, APIలు నడుస్తాయి. GPS, ఫోటోలు, టైమ్‌స్టాంప్‌లతో ధృవీకరణ జరుగుతుంది. ఆధార్ ఆపరేటర్ల ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను ఉపయోగించి వేగంగా 26 రాష్ట్రాల్లో విస్తరించడం విశేషం.






