- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి సినీ ఇండస్ట్రీని తీసుకురావాలి : శివాజీ
ఏపీకి సినీ ఇండస్ట్రీని తీసుకురావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీపై టాలీవుడ్ అగ్ర నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీని తీసుకురావాలని విన్నవించారు. లెనిన్ సక్సెస్ మీట్ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో ప్రతిరోజు 40 సినిమాల షూటింగ్ నడుస్తోందన్నారు. పదివేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తోందని వివరించారు. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సినీ ఇండస్ట్రీ రావాలని... మంత్రి దుర్గేష్ కు విన్నవించారు.
ఏపీలో ఉన్న వాళ్లకు అవకాశం కల్పించాలని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఏపీకి కూడా న్యాయం జరగాలంటే.. సినీ ఇండస్ట్రీ రావాల్సిందేనని తెలిపారు. చాలా సినిమాలకు ఫైట్లు వర్కౌట్ అవుతాయని... మరికొన్ని సినిమాలకు పాటలు వర్కౌట్ అయిన సందర్భాలు ఉన్నట్లు వివరించారు. కానీ ఈ లెనిన్ సినిమా విషయంలో మాత్రం 200% కథ ముఖ్యమన్నారు. అందుకే గ్రాండ్ సక్సెస్ అయినట్లు వివరించారు.






