బోనాల పండుగ.. సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

బోనాల పండుగ.. సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Next Story