- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
R Ashwin: 2027 వరల్డ్ కప్ లో అతను ఆడాల్సిందే..లేకపోతే కష్టమే!
by velandi.Saikiran |
2027 వరల్డ్ కప్ లో కుల్దీప్ యాదవ్ ఆడాల్సిందేనని అశ్విన్ సూచనలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ వరల్డ్ కప్ లో కచ్చితంగా కుల్దీప్ యాదవ్ ను ఆడించడం చాలా ముఖ్యమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లలో ఒకరిని మాత్రమే తీసుకోవాలని సూచనలు చేశారు.
ఇంగ్లాండ్ జట్టులో ఆల్ రౌండర్ విల్ జాక్స్ తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ రషీద్ ను ఆడిస్తున్నారని స్పష్టం చేశారు. అదే ఫార్ములాను కూడా భారత్ ఫాలో కావాలన్నారు. కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నారని.. ఈ క్రమంలో వచ్చే వరల్డ్ కప్ 2027లో అతడికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అప్పుడే భారత జట్టుకు మెరుగైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు అశ్విన్.
Next Story






