సైదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

by velandi.Saikiran |   (  Updated:2026-07-15 20:30:46  IST  )

సైదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

సైదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపల్లి బస్టాండ్ వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికీ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన కొయెడ మధు (30) తన భార్య కూతురుతో కలిసి ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వెళుతుండగా చింతలపల్లి బస్టాండ్ సమీపంలో హుజురాబాద్ నుండి సైదాపూర్ వస్తున్న ట్రాలి ఆటో ఢీకొనడంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్యకు, పాపకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై కొప్పుల స్వాతి చేరుకుని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story