- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యవంశీ రికార్డు బ్రేక్..34 బంతుల్లోనే శతకం
పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో అమన్ ఖాన్ 34 బంతుల్లోనే శతకంతో విధ్వంసం సృష్టించి, 129 పరుగులు చేశారు

X
దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అమన్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు అమన్ ఖాన్. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న అమన్ ఖాన్.. 129 పరుగులు సాధించాడు. టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ లో బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని కూడా వెనక్కి నెట్టి, రెండో స్థానానికి చేరాడు. తెలంగాణ టీ20 లీగ్ లో హైదరాబాద్ ప్లేయర్ అమన్ రావు 32 బంతుల్లోనే సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకొని మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇది ఇలా ఉండగా, అమన్ ఖాన్ ను రూ.40 లక్షల బేస్ ధరకు ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేశారు.
Next Story






