నీ వ‌ల్లే నాకు "అయ్య‌గారు" అనే పేరు వ‌చ్చింది

by velandi.Saikiran |   (  Updated:2026-07-15 19:20:10  IST  )

నీ వ‌ల్లే నాకు "అయ్య‌గారు" అనే పేరు వ‌చ్చిందంటూ అభిమాని అఖిల్ హ‌గ్ చేసుకున్నాడు.

నీ వ‌ల్లే నాకు అయ్య‌గారు అనే పేరు వ‌చ్చింది
X

దిశ‌, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ లెనిన్. ఎన్నో ఏళ్లుగా బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. ఈ మాస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. జూలై 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వారం రోజులు పూర్త‌య్యేలోపు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే దిశగా దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు.

అయితే ఈ సక్సెస్ మీట్ ప్రారంభం కాకముందే.. ‘అయ్యగారే నం.1’ అంటూ రచ్చ చేసిన డై హార్ట్ అభిమాని నాగరాజును కలిశాడు హీరో అఖిల్. ఈ క్రమంలో అఖిల్ ను హగ్ చేసుకుని నాగరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అతడిని ఓదార్చుతూ... నీ వల్లే తనకు అయ్యగారు పేరు వచ్చిందని అఖిల్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వీళ్ళిద్దరికీ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Next Story