ప్రసవానికి వెళ్లి ప్రాణాలతో పోరాటం

by Batti.Sumithra |

మండలంలోని చాపరాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మరిపాడు గ్రామానికి చెందిన తాటి భవాని ప్రసవం కోసం రామవరం ప్రాంతంలోని మాతా శిశు ఆసుపత్రిలో చేరింది.

ప్రసవానికి వెళ్లి ప్రాణాలతో పోరాటం
X

దిశ, ములకలపల్లి : మండలంలోని చాపరాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మరిపాడు గ్రామానికి చెందిన తాటి భవాని ప్రసవం కోసం రామవరం ప్రాంతంలోని మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసవ సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. తల్లి ప్రాణాలతో పోరాడుతుండగా, నవజాత శిశువు కూడా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. బాధ్యుల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రసూతి ఆసుపత్రుల పనితీరు పై పర్యవేక్షణ పెంచాలని కోరారు.

Next Story