- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొసైటీ గోదాంతో రైతులకు ఎంతో మేలు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో నిర్మించిన సొసైటీ గోదాములు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

దిశ, నాగిరెడ్డిపేట్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో నిర్మించిన సొసైటీ గోదాములు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. అంతకుముందు మాసాన్‌పల్లి గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశారు. బుధవారం తాండూర్-కిచ్చన్నపేట సొసైటీ ఆధ్వర్యంలో మెల్లకుంట తండాలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన సొసైటీ గోదాం, దుకాణ సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఈ గోదాములు ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా గోదాములు నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు.
మండల కేంద్రంలో రూ.2 కోట్ల 25 లక్షల వ్యయంతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి నిధులు మంజూరయ్యాయని, మండల ప్రజాపరిషత్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థలో ఉందని, ఆ కార్యాలయానికి కూడా నూతన భవనం మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, తాండూర్ సొసైటీ చైర్మన్ అకిడి గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబురావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటి కిష్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి, మెల్లకుంట తండా సర్పంచ్ బాల్య నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మురళీమోహన్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాం గౌడ్, వసురం, ఇమాం తదితరులు పాల్గొన్నారు.






