Tamilanadu: కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా బహిర్గతం

by S Gopi |

దీనిపై స్పందించిన రిలయన్స్, తమ డేటా థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వర్‌లో కొంత మేర లీక్ కావడం నిజమేనని అంగీకరించింది.

Tamilanadu: కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా బహిర్గతం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన కీలక సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. 'వరల్డ్ లీక్స్' అనే ర్యాన్సమ్‌వేర్ గ్రూప్, ప్లాంట్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, సాంకేతిక పత్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటిస్తూ వాటిని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసింది. ఈ సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి లభించిందని కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన రిలయన్స్, తమ డేటా థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వర్‌లో కొంత మేర లీక్ కావడం నిజమేనని అంగీకరించింది. అయితే ఏ సమాచారం బయటకు వెళ్లిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని తెలిపింది.

ఈ డేటా లీక్ వ్యవహారంపై సీఈఆర్‌టీ-ఇన్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రాయిటర్స్ పరిశీలించిన పత్రాల్లో యూనిట్-3, యూనిట్-4 నిర్మాణానికి సంబంధించిన కొన్ని డిజైన్‌లు, సరఫరాదారుల జాబితాలు, తనిఖీ రికార్డులు, బీమా పత్రాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆ పత్రాల ప్రామాణికతపై అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి సమాచారం దుర్వినియోగం అయితే అణు కేంద్రాల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ డేటా ఎంతవరకు బయటకు వెళ్లింది, దాని ప్రభావం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story