పాండవ బస్తీలో అగ్నిప్రమాదం

by Ratna Kumari |

మెట్టుగూడ డివిజన్ పరిధిలోని పాండవ బస్తీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

పాండవ బస్తీలో అగ్నిప్రమాదం
X

దిశ, సికింద్రాబాద్ : మెట్టుగూడ డివిజన్ పరిధిలోని పాండవ బస్తీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లోని కొన్ని విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఫైర్ ఇంజన్‌తో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో చర్యలు చేపట్టడంతో మంటలు సమీపంలోని ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Next Story