ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో తండ్రి కొడుకులకు గాయాలు

by Taduka Kalyani |

వ్యవసాయ పొలానికి వెళ్తున్న బైకును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో తండ్రి కొడుకులకు గాయాలైన సంఘటన మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.

ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో తండ్రి కొడుకులకు గాయాలు
X

దిశ, మిడ్జిల్ : వ్యవసాయ పొలానికి వెళ్తున్న బైకును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో తండ్రి కొడుకులకు గాయాలైన సంఘటన మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మిడ్జిల్ గ్రామానికి చెందిన శాంతయ్య కుమారుడు శ్రీశైలంతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. మిడ్జిల్ -వెల్జాల ప్రధాన రహదారిలో ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ వాహనం వీరి బైక్ ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తండ్రీ కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ను టిప్పర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా టిప్పర్లు అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదం చోటు చేస్తుందని స్థానిక రైతులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ , డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story