కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి.. రేవంత్‌ని జైలుకు పంపాలి: RS ప్రవీణ్

by Vemula.Srinu Prasad |

రేవంత్‌రెడ్డి రెండు ఓట్ల గురించి తెలియకుండా, ఫేక్ అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని.. వెంటనే కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు...

కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి.. రేవంత్‌ని జైలుకు పంపాలి: RS ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి రెండు ఓట్ల గురించి తెలియకుండా, ఫేక్ అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని.. వెంటనే కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమన్నారు. ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడ్డారన్నారు. రేవంత్‌రెడ్డికి కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం సొంత ఊరిలో ఒక ఓటు, కొడంగల్‌లో మరో ఓటు ఉన్నదని ఆరోపించారు. గత ఎన్నికల్లో కుటుంబ సమేతంగా కొడంగల్‌లో ఓటు వేశారన్నారు.

రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 17 ప్రకారం ఎవరికీ రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉండకూడదని తెలిపారు. ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలని.. నేరం రుజువైతే ఏడాది జైలు, జరిమానా లేదా రెండు విధించవచ్చని చెప్పారు. సీఎం 31 సెక్షన్ ప్రకారం నేరస్థుడని అన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆర్టికల్ 324 ప్రకారం వెంటనే కేసు నమోదు చేయాలని.. ఫాక్ట్ చెక్ సంస్థపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో రేవంత్‌రెడ్డికి ఎలాంటి ఓటు లేదని చెప్పారని.. కానీ... ఇప్పటికీ ఓటు ఉన్నదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను నడిపేది రేవంత్‌రెడ్డా సుదర్శన్ రెడ్డా సమాధానం చెప్పాలన్నారు. మీనాక్షి నటరాజన్‌కు ఒక న్యాయం.. రేవంత్‌రెడ్డికి మరో న్యాయం ఉండొద్దన్నారు.

Next Story