వీరన్నపల్లిలో రూ.20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

by Ratna Kumari |

తలకొండపల్లి మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.

వీరన్నపల్లిలో రూ.20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
X

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి రూ.5 లక్షలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరై మొత్తం రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం నిర్మాణం, సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి పనుల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్ లక్ష్మణ్, ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘురాములు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కడ్తాల్ సర్పంచ్ బిక్షపతి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, శ్రీశైలం, రాజు, మాజీ ఎంపీటీసీ రమేష్, ఉపసర్పంచ్ యాదిరెడ్డి, అజీజ్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కాంగ్రెస్ నాయకులు రేణు రెడ్డి, డేవిడ్, తిరుపతయ్య, నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ గౌడ్, రాజేందర్ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story