- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్
వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగల ముఠాను పట్టుకున్నారు.

దిశ, ఏటూరునాగారం: వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగల ముఠాను పట్టుకున్నారు. అనుమానాస్పదంగా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా కాపర్ వైర్, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలు లభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో వెళ్తున్న నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా 312 కిలోల కాపర్ వైర్‌తో పాటు కటింగ్ ప్లేయర్లు, ఇతర పనిముట్లు లభించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ములుగు జిల్లాలో 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.. మొత్తం 18 ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. నిందితులు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను దొంగిలించేవారని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ వైర్‌ను మణుగూరులోని స్క్రాప్ దుకాణాల్లో విక్రయించి వచ్చిన డబ్బులను నలుగురు సమానంగా పంచుకునేవారని తెలిపారు. అరెస్టైన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గణపురం సాయి ప్రకాష్ అలియాస్ హాని, షేక్ షంషీర్, కూకట్ల అఖిల్, నల్లగట్ల దయాసాగర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి దొంగతనాలకు ఉపయోగించిన ఆటో, కటింగ్ ప్లేయర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన కాపర్ వైర్‌ను కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారుల పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






