- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూడి గేదెకు సూది వికటించింది.. గర్భం కోల్పోయిన మూగజీవి
పాడి పశువులకు ప్రథమ చికిత్సలు అందించాల్సిన ఒక కాంటాక్ట్ ఉద్యోగి ఏకంగా శస్త్ర చికిత్సలు చేసి పాడి పశువుల చావులకు కారణం అవుతున్నాడు.

దిశ,బిజినేపల్లి : పాడి పశువులకు ప్రథమ చికిత్సలు అందించాల్సిన ఒక కాంటాక్ట్ ఉద్యోగి ఏకంగా శస్త్ర చికిత్సలు చేసి పాడి పశువుల చావులకు కారణం అవుతున్నాడు. పాడి పశువుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలియని రైతులు వెటర్నరీ అసిస్టెంట్లను ఆశ్రయిస్తే వారు ఏకంగా శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. ఇలాంటి ఘటననే మండలంలోని మమ్మయిపల్లి గ్రామంలో మూడు రోజుల కిందట చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైతు తెలిపిన వివరాల ప్రకారం మామ్మయిపల్లి గ్రామానికి చెందిన కుర్మయ్య అనే పాడి రైతు తనకు చెందిన 8 గేదెల్లో ఒక గేదె ఏదకు రావాలని ఈ నెల 9వ తేదీన సలహా కోసం వనపర్తి జిల్లాలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగి రామును ఆశ్రయించాడు. ఆ ఉద్యోగి గేదె జననాంగంలో చేతి ద్వారా పరిశీలించి గేదె ఏదకు రాలేదని, ఏదకు రావడానికి ఒక సూది ఇస్తానని రూ.650 తీసుకొని ఒక సూది ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత దాదాపు 6 నెలల వరకు వయస్సు ఉన్న పిండం అబార్షన్ చెంది బయటకు వచ్చింది. 10 కేజీల వరకు బరువు ఉన్న ఆ పిండానికి కాళ్లు, తల, శరీరం ఏర్పడ్డాయి. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
అర్హతకు మించిన చికిత్సలు
వనపర్తి జిల్లాలో వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాము అనే ఒప్పంద ఉద్యోగి తన అర్హతకు మించి శస్త్ర చికిత్సలు చేస్తున్నాడు. ఉన్నతాధికారులు తమ పని భారం తగ్గించుకోవడానికి వెటర్నరీ అసిస్టెంట్ల ద్వారా ఈలాంటి చికిత్సలను చెపిస్తూ రైతులను నష్ట పరుస్తున్నారు. మూడు దశాబ్దాల కాలం నుండి ఈ మధ్య కాలంలో పాడి పశువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే పశు వైద్యాదికారుల నిర్లక్ష్యంతో మళ్ళీ వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ విషయమై మండల పశు వైద్యాధికారి డా. జీవితను వివరణ కోరగా రైతు ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు ఇవ్వకపోతే చర్యలు తీసుకోరా మేడం అని దిశ విలేకరి అడిగితే విచారణ చేస్తామని మాత్రమే సమాధానం ఇచ్చారు.దీంతో ఉన్నతాధికారుల సహకారం ఉండటంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పాడి రైతులు ఆరోపిస్తున్నారు.






