- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు కంటే విద్యయే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది..
డబ్బు కంటే నాణ్యమైన విద్యనే పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : డబ్బు కంటే నాణ్యమైన విద్యనే పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో రూ. 3.65 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన స్కూల్ ట్రాన్స్ఫార్మేషన్ ఐ-స్పార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,673 మంది విద్యార్థినుల భద్రత, సౌకర్యం, నాణ్యమైన విద్యను దృష్టిలో ఉంచుకుని సోలార్ ఫెన్సింగ్, బంకర్ బెడ్స్, అత్యాధునిక రోబోటిక్స్ & సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యంతో చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణంలో బోధన కొనసాగించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇలా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగళ్లపల్లి శ్రీవాణి, 14వ వార్డు కౌన్సిలర్ తుమ్మేటి పాండు యాదవ్, ఐఓసీఎల్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






