మరింత పటిష్టంగా అమలు చేయండి: పోక్సో చట్టంపై రేవంత్ రెడ్డికి పవన్ లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-15 12:17:36  IST  )

పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన పోక్సో కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు...

మరింత పటిష్టంగా అమలు చేయండి: పోక్సో చట్టంపై రేవంత్ రెడ్డికి పవన్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన పోక్సో కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అని చెప్పిన పవన్.. ఆర్టికల్ 21, 39 ప్రకారం పిల్లల హక్కులను కాపాడాలని చెప్పారు. పోక్సో కేసుల్లో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ప్రాథమిక విచారణతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు. కాగా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల ఉద్దేశించి ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎస్‌తో పాటు డీజీపీకి కూడా పవన్ కల్యాణ్ లేఖ రాశారు. అయితే రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో రాజకీయ కోణం కంటే పరిపాలనా పరమైన సూచనలు చేయడంతో ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

Next Story