- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు మహాశయులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. దీనికి సంబంధించి సరికొత్త షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Publication) అధికారికంగా విడుదల కానుంది. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, మార్పులు-చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల (Claims & Objections) స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువునిచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తి స్థాయి పరిష్కార ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను (Final Publication) అక్టోబర్ 12న అధికారికంగా ప్రకటించనున్నారు.
రాజకీయ పార్టీల అభ్యర్థనలు..
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ (SIR) నత్తనడకన కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోరింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రజలకు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు కూడా అందలేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా వారు కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థనలు పంపారు. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు జూలై 24 వరకు ఉండగా.. తాజాగా రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.






