- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత హక్కుల కోసం జూలై 18న ‘ఛలో సరూర్‌నగర్’ యువ సంగ్రామ సదస్సు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన "యూత్ డిక్లరేషన్"లో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) విమర్శించారు.

దిశ, ఇబ్రహీంపట్నం : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన "యూత్ డిక్లరేషన్"లో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) విమర్శించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న ‘ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు’ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత, విద్యార్థులను సమీకరించి సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున సభకు హాజరై తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమై యువత, విద్యార్థులు, నిరుద్యోగులను నిరాశపరిచిందని ఆరోపించారు.
ఈ సమావేశంలో మంచాల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, జెర్కొని రాజు, నూతనగట్టి శేఖర్, కౌన్సిలర్ కొండ్రు ప్రవీణ్, మురళి, మడుపు శివసాయి, బద్రీనాథ్ గుప్తా, వినయ్ రెడ్డి, పి.రాజ్‌కుమార్, ఏనుగు భరత్ రెడ్డి, సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, బొట్టు ప్రవీణ్, రాజేష్ జీవన్ రెడ్డి, వీరిష్ ముదిరాజ్, పి. తీర్మల్ రెడ్డి, దొండ వినోద్ రెడ్డి, కె.బాలు, పవన్, శివ, గణేష్, ఉమాకాంత్, కానుగల మహేష్, సోయిల్, విద్యాసాగర్, ప్రవీణ్, శివకుమార్, కె.మహీందర్, నాని, లాటు గౌడ్, మనీష్ రెడ్డి, శివరెడ్డి, రవీందర్, ముకేశ్, అభినవ్, వెంకటేష్, బన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






